ఆర్ట్స్ కాలేజ్ ఎన్సిసి ఆర్మీ క్యాడెట్స్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యటక దినోత్సవం.
ఈరోజు యూనివర్సిటీ ఆర్ట్స్ & సెన్స్ కళాశాల ఎన్సిసి ఆర్మీ క్యాడెట్స పదవ తెలంగాణ బెటాలియన్ తరపున “ప్రపంచ పర్యాటక దినోత్సవం” నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి గౌరవనీయులైన ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ జ్యోతి గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ 27న జరుపుకుంటారు ఈరోజును 1980 నుండి ఐ.రా.స ప్రపంచ పర్యాటక సంస్థ నిర్వహిస్తుంది. పర్యాటక ప్రాముఖ్యత మన సమాజం పై దాని ప్రభావం గురించి అవగాహన కల్పించడానికి ఈ ప్రపంచ పర్యటక దినోత్సవం జరుపుకుంటారు అని చెప్పడం జరిగింది మరియు క్యాడెట్స్ ఎస్.యు.ఓ ఎం.రాజ్‌కుమార్,జే.యు.ఓ బి.ప్రశాంత్, క్యాడేట్ బి.అభిరామ్ ఉపన్యాసించారు మరియు క్యాడెట్లు పోస్టర్లు తయారు చేయడం ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా లెఫ్టినెంట్ డా|| స్వామి శాడ గారు, ఫ్లయింగ్ ఆఫీసర్ డా|| బి.ప్రసాద్, డా|| నేహదా పర్వీన్ గారు మరియు 60 మంది ఎన్సిసి క్యారేట్స్ పాల్గొన్నారు.