Celebrating the Birth Anniversary of “Sri Konda Laxman Bapuji”, Freedom Fighter on 27th September 2024

బాపు బాటలో దేశ స్వతంత్రం కోసం వేసిన అడుగులు
తెలంగాణ రాష్ట్ర స్వతంత్రం వరకు ఆపకపోవడం
నిజంగా సాహసమే..
బానిసలుగా
బ్రతకం అని తెగేసి చెప్పి
మొదలు తెల్లొడకి
తర్వాత నవాబుకు
చివరకు ఆంద్రోడికి
చుక్కలు చూపించిన
బహుజన సూర్యుడు…
మన తెలంగాణ బాపూజి..
ఆయనే కొండా లక్ష్మణ్ బాపూజి..
పదవులు కాదు
ప్రాంతం ముఖ్యం
అత్మగౌరవం ముఖ్యం అని
పదవులను గడ్డి పోచలుగా వదిలేసిన యోధుడు
కొండా బాపూజి..
రాజీనామాను నిరసన రూపంగా తెలంగాణకు నేర్పిన‌ గొప్ప దార్శనికుడు..
దక్కన్ భూమి పుత్రుల గోసలకు పరిష్కారం
ప్రత్యెక తెలంగాణ సాధనే అని
బలంగా నమ్మి పోరాటం చేసిన ఉద్యమవీరుడు మన బాపూజి..
తన గూడు జలదృశ్యంనే
యుద్ద వేదికగా మార్చిన గొప్ప త్యాగమూర్తి మన కొండా బాపూజి..
తన కలల స్వప్నం తెలంగాణను చూడకుండానే ప్రయాణం ముగించిన ఓ అహింసామూర్తి
నీకు మా జోహారులు..
బాపూ..
తుమ్ జిందా హై..
తెలంగాణ గుండెల్లో తుమ్ జిందా హై….
Dr.Firoz