Celebrating the Birth Anniversary of “Veeranari Chaakali Ilamma” on 26th September 2024

CIRCULAR

The Government of Telangana declared the birth anniversary of Veeranari Chakali Ilamma as a state festival.

As per the circular issued by Registrar, KU it is hereby informed that birth anniversary will be celebrated by garlanding the portrait and paying tribute.

In this connection please assemble at the Administrative block of UASC at 11:00 AM(i.e. 26-09-2024) without fail and make it a success.

Sd/-
Principal
UASC KU
Subedari Hnk

గోసి కట్టుకున్న తెలంగాణ మట్టి బిడ్డ
తన కష్టం తనది కాకుండ పోతుంటే
కొడవలై ఎదురు తిరిగిన
తెలంగాణ పోరు బిడ్డ..
తెలంగాణలో మోలిసిన ధిక్కార గళం..
ఆమే ఐలమ్మ..
ఆమే చాకలి ఐలమ్మ..
భూమి కోసం
తన పంట కోసం
యుద్దం చేసింది..
సంఘం నీడలో
ధిక్కారం వినిపించింది..
పిడికిలెత్తి గర్జించింది
తన హక్కుల కోసం పోరాటం నడిపి
నోరు లేనోళ్ళకు మాట నేర్పింది..
అధికార మదంతో
ఆధిపత్యం చెలాయిద్దామంటే
కుదరదని
తన కష్టం జోలికొస్తే
వాడు
పటేలైనా
నిజామోడైనా
జాన్తా నహీ అని
గర్జించిన బెబ్బులి..
పోరాటంలో
ధిక్కారంలో
హక్కుల యుద్దంలో
ఆడ మగ తేడా లేదని
ఆచరణలో చూపిన యోధురాలు ..
ఐతే..
అలాంటి
గొప్ప ధైర్యాన్ని
ఒక‌ కులానికో
ఒక వర్గానికో పరిమితం చేయడం
అంగీకారం కాదు..
ఆ ధిక్కారం
అణగారిన
అణగదొక్కబడుతున్న
సమాజానికి దిక్సూచి
అందుకే
ఆ ఐలమ్మ
చాకలి ఐలమ్మ కాదు
తెలంగాణ ఐలమ్మ..
అవును..
తెలంగాణ ఐలమ్మే..
ఈరోజు నుండి అలాగే పిలుద్దాం..
Dr.Firoz